రొమాంటిక్, లక్ష్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది యంగ్ బ్యూటీ కేతిక శర్మ

ఈ రెండు సినిమాలు హిట్ కాకపోయినా.. నటనపరంగా కేతికకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

ఇండస్ట్రీలో ఈ అమ్మడు డిమాండ్ ఏమాత్రం తగ్గట్లేదు. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో లక్కీ ఛాన్స్ అందుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

లేటేస్ట్ టాక్ ప్రకారం కేతిక రంగ రంగ వైభవంగా సినిమా విడుదలకు ముందే సాయిధరమ్ తేజ్ సరసన నటించనుందట.

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో సముద్రఖని వినోదయా సితం రీమేక్  సినిమాలో సాయిదరమ్ తేజ్ కీలకపాత్రలో నటించనున్నాడు.

ఈ మూవీలో సాయిధరమ్ తేజ్ సరసన కేతికను ఎంపిక చేశారట మేకర్స్. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట.