కేరళలోని శబరిమల ఆలయం గురించి తెలియని వారుండరు.
ఏటేటా ఆయ్యప్ప దీక్ష తీసుకునే భక్తులు ఒక్కసారైనా వెళ్లాలనుకునే ప్రధాన పుణ్యక్షేత్రం శబరిమల.
అందుకే ఏటా కేవలం మూడు నెలలే అయ్యప్ప స్వాముల సీజన్ అయినప్పటికీ శబరిమల వార్షిక ఆదాయం మాత్రం కోట్లలో ఉంటుంది
ఆ క్రమంలోనే ఈ ఏడాది కూడా శబరిమల ఆలయానికి దాదాపు రూ. 320 కోట్ల ఆదాయం వచ్చిందని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు తెలిపింది.
ఈ శుక్రవారం(జనవరి 20)తో వార్షిక తీర్థయాత్ర ముగియనుండడంతో ఆలయ ఆదాయాన్ని ప్రకటించింది ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు.
జనవరి 14 నాటికి శబరిమల కొండ ఆలయానికి మునుపెన్నడూ లేనంతగా గరిష్ఠ స్థాయిలో రూ. 320 కోట్ల ఆదాయం అందిందని ఆలయ బోర్డు సీనియర్ అధికారి తెలిపారు.
ఇక 2018 లో ఆలయానికి ఆదాయంగా వచ్చిన రూ. 260 కోట్లు ఇప్పటివరకూ గరిష్ఠ ఆదాయంగా ఉండేది.