నాని, కీర్తి సురేష్ జంటగా కనిపించనున్న తాజా చిత్రం ‘దసరా’
ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఓ బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ కొన్ని ఆసక్తికార విషయాలు వెల్లడించారు
‘‘మహానటి’కి నేను తొలుత నో చెప్పాను. సావిత్రమ్మ పాత్రలో నటించడానికి ఎంతో భయపడ్డాను. కానీ, దర్శకుడు నాగ్ అశ్విన్ నన్ను ఎంతో ప్రోత్సహించారు
‘ఇది నువ్వు చేయగలవు’ అని ధైర్యనిచ్చారు. ఆయనే నన్ను అంతగా నమ్మినప్పుడు.. నన్ను నేనెందుకు నమ్మకూడదనుకున్నా. అలా ప్రాజెక్ట్ పూర్తి చేశా.
అయితే, ఆ పాత్రను అంగీకరించినందుకు కొంతమంది నన్ను ట్రోల్ చేశారు. అది నాకు తెలియదు.
ఆ సినిమా ప్రమోషన్స్‌లో ఉన్నప్పుడు.. ‘మీపై వస్తోన్న విమర్శల గురించి స్పందించగలరు’ అని విలేకర్లు అడిగారు.
అప్పుడే నాక్కూడా ఈ ట్రోల్స్ గురించి తెలిసింది. సోషల్‌మీడియాలో వచ్చే నెగెటివిటీపై నేను అంతగా ఆసక్తి చూపించను.
అందుకే ట్రోల్స్, విమర్శలు నా వరకూ రావు. ఇక ‘మహానటి’ అప్పుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. సావిత్రమ్మకు విపరీతమైన ప్రేక్షకాదరణ ఉంది.
ఆమె బయోపిక్‌లో నటించడం భయంగా అనిపించింది. ఆమె కుమార్తెతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.
సవాళ్లు, విమర్శలు ఉన్నప్పటికీ ఆ పాత్ర చేసినందుకు సంతోషంగా ఉన్నా’’ అని తెలిపారు కీర్తి సురేశ్