ఫిల్మ్ ఇండస్ట్రీలో వేళ్లూనుకుని ఉన్న క్యాస్టింగ్ కౌచ్‌ గురించి.. జడలు విప్పుతున్న కమిట్మెంట్ గురించి తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా మాట్లాడారు.

మాట్లడడమే కాదు.. ఒక వేళ తనకు ఇలాంటి అనుభవం ఎదురైతే ఏం చేస్తారో కూడా చెప్పారు.

ఆ మాటలతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.

ఆ క్యాస్టింగ్ కౌచ్‌ వల్ల చాలా మంది హీరోయిన్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కాని తన విషయంలో మాత్రం అలా జరగలేదని చెప్పారు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.

అంతేకాదు అమ్మాయిల తీరుతో కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్‌ పెరిగే అవకాశం ఉందని ఆమె అన్నారు. ఇండస్ట్రీలో నలుగురు మగాళ్ల మధ్యలో...

ఓ అమ్మాయి ఎలా ఉండాలో కూడా.. అమ్మాయిలందరికీ తెలియాలని.. అది ఇలాంటి చేదు అనుభవాల నుంచి మనల్ని దూరంగా జరుపుతుందన్నారు కీర్తి.