జీవితంలో తీపి లేకుంటే అసలు టేస్టే ఉండదు
అలాగని ఇబ్బడిముబ్బడిగా స్వీట్స్ తింటే.. మధుమేహం, ఊబకాయం వంటి ప్రాణాంతక వ్యాధులతో జీవితాంతం పోరాడాల్సి వస్తుంది
ఈ సమస్యలన్నీ కృతిమ చక్కెరల ద్వారా వస్తాయి
సహజమైన తీపి పదార్థాలను తినడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ సహజసిద్ధమైన తీపి పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం
ఆహార తయారీలో శుద్ధి చేసిన తెల్ల చక్కెరకు ప్రత్యామ్నాయంగా బ్రౌన్ షుగర్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది
చెరకులో ఉండే పోషకాలన్నింటినీ నిలుపుకునేలా ఈ బ్రౌన్ షుగర్ ఉంటుంది. దీని నుంచి వేడి వేడి పానియాలు, డేజర్ట్స్, సాంప్రదాయ స్వీట్స్ తయారు చేసుకోవచ్చు
ఎండిన, మెత్తగా పొడి చేసిన ఖర్జూరం నుండి తయారైన ఖర్జూర చక్కెర కూడా నిర్విషీకరణలో సహాయపడుతుంది
బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫిట్‌నెస్ ఔత్సాహికులు దీన్ని ఇష్టపడతారు
తేనెటీగల నుండి నేరుగా సేకరించిన ముడి తేనె అటవీ తేనెగా మార్కెట్లలో లభిస్తుంది. దీనిని ప్రాసెస్ చేయరు. సహజమైన తీపి పదార్థం
కొబ్బరి, ఫామ్ షుగర్ ప్రాసెస్ చేసిన చక్కెరతో పోలిస్తే.. తక్కువ ఫ్రక్టోజ్ కంటెంట్ కలిగి ఉంటుంది. దాంతోపాటు తక్కువ గ్లైసెమిక్ సూచనలు కలిగి ఉంటుంది