దేశంలో చాలా నగరాలు అత్యధిక వేడిని కలిగి ఉంటాయి. అందుకే చాలామంది సెలవులు దొరికితే చాలు చల్లటి ప్రాంతాల్లో పర్యటిస్తారు
అందులో ముఖ్యమైనవి హిల్ స్టేషన్లు. సిమ్లా, మనాలి, నైనిటాల్ వంటి హిల్ స్టేషన్‌లు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి
మీరు ఏదైనా హిల్ స్టేషన్‌ని సందర్శించాలనుకుంటే కచ్చితంగా కొన్ని వస్తువులను మీ బ్యాగ్‌లో ఉంచుకోవాలి. లేదంటే చాలా ప్రమాదంలో పడుతారు. ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం
హిల్ స్టేషన్ వద్ద ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీతో ఒక లెదర్ జాకెట్ తీసుకువెళ్లండి
మీరు హిల్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు మఫ్లర్ లేదా క్యాప్ ఉంటే మంచిది. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అంతేకాదు తేలికగా ఉంటాయి
హిల్ స్టేషన్‌కు వెళ్లబోతున్నట్లయితే అత్యవసర నంబర్‌లను కచ్చితంగా మీ వద్ద ఉంచుకోవాలి. తద్వారా మీరు అపాయంలో ఉన్నప్పుడు వాటిని ఉపయోగించవచ్చు
ప్రయాణించినప్పుడు కొన్ని సార్లు గాయపడటం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రథమ చికిత్స కిట్ వెంట ఉంటే చికిత్స చేయవచ్చు
డిజిటల్ కెమెరా అనేది మీ ట్రిప్‌ను చాలా ప్రత్యేకంగా మార్చగలదు. మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయబోతున్నట్లయితే కెమెరాతో పాటు మీతో సెల్ఫీ స్టిక్ తీసుకోవడం మర్చిపోవద్దు