రాజమౌళి రూపొందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు

ఈ చిత్రంలో ‘నాటు నాటు’ పాట ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ అవార్డును అందుకొని సంబరాలు జరుపుకుంటోంది

హుషారైన స్టెప్పులతో సాగే ఈ పాట సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు అందరితో స్టెప్పులు వేస్తుంది

ఈ పాట తన రెండేళ్ల కుమారుడి మనసును కూడా దోచుకుందంటూ ఒక ఇంటర్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్‌ హీరోయిన్ కరీనా కపూర్‌

‘మా చిన్న అబ్బాయి జెహ్‌ నాటు నాటు పాట పెడితేనే అన్నం తింటాడు. ఈ పాటను తెలుగులోనే వినడానికి ఇష్టపడతాడు’ అని తెలిపింది కరీనా

‘95వ అకాడమీ అవార్డ్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఆస్కార్‌ను గెలవటంతో దేశం మొత్తం ఆనందంతో నిండిపోయింది.

ఇందులో నేను సభ్యురాలైనందుకు సంతోషిస్తున్నాను.

భారతీయ చిత్రలను ప్రేక్షకులు ఎక్కువగా చూడటం పట్ల గర్వంగా భావిస్తున్నాన’ని పేర్కొంది కరీనా