మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై ఓ వ్యక్తి కేసు పెట్టాడు గ్యాంగ్ రేప్ కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన ఓ వ్యక్తి..
తనకు ప్రభుత్వం నష్ట పరిహారంగా రూ.10,006.2 కోట్ల చెల్లించాల్సిందేనంటూ మధ్యప్రదేశ్‌లోని రత్తాం పట్టణం కోర్టుకెక్కాడు.
గిరిజనుడైన కాంతూ ఆలియాస్ కాంతీలాల్ భీల్(35)ను గ్యాంగ్ రేప్ కేసులో 2020 డిసెంబర్ 23న పోలీసులు అరెస్టు చేశారు.
దాదాపు రెండేళ్లపాటు జైల్లో ఉన్నాడు. స్థానిక కోర్టు 2023 లో అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.
అంతరం కాంతీలాల్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.జైల్లో ఉన్నప్పుడు భార్యతో లైంగిక సుఖానికి దూరమయ్యానని,
దేవుడిచ్చిన వరం వృథా అయ్యిందని, తీవ్ర మానసిక క్షోభ అనుభవించానని పిటిషన్‌లో పేర్కొన్నారు.
తనకు రూ.10,000.2 కోట్ల నష్ట పరిహారం చెల్లించేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
ఇందులో రూ.10,000 కోట్లు మానసిక క్షోభ అనుభవించినందుకు మిగతా రూ.6.02 కోట్ల ఇతర ఖర్చుల కోసమని విన్నవించాడు.