చిన్న సినిమాగా వచ్చి బ్లాక్‌బస్టర్‌ హిట్ అందుకున్న చిత్రం ‘కాంతార’

ఈ చిత్రనికి రిషబ్‌ శెట్టి హీరో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించారు

హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్ పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ మూవీ కన్నడతోపాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సంచలన విజయం సాధించింది

కాగా ఇప్పుడు ఈ చిత్రం దేశ సరిహద్దులు దాటనుంది

ఈ సినిమా ఇటాలియన్‌, స్పానిష్‌ భాషల్లోనూ ప్రేక్షకులను అలరించనుంది

ఆదివారం ఈ విషయాన్ని  సోషల్ మీడియాలో షేర్ చేశారు రిషబ్‌

‘అంతర్జాతీయ ప్రేక్షకుల నుంచి ‘కాంతార’కి వస్తున్న డిమాండ్‌ దృష్ట్యా ఈ చిత్రాన్ని ఇటాలియన్‌, స్పానిష్‌ భాషల్లో థియేటర్లలో త్వరలోనే విడుదల చేయనున్నాం

ఈ వార్తను మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు రిషబ్‌