కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటుడు వశిష్ఠ, హీరోయిన్‌ హరిప్రియ డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే

గత కొన్ని రోజులుగా ప్రేమలో మునిగితేలుతోన్న ఈ జంట తాజాగా నిశ్చితార్థం చేసుకుంది

హరిప్రియ నివాసంలో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు

 ఒక సినిమాలో షూటింగ్‌లో  హరిప్రియ, వశిష్ఠసింహ మధ్య ప్రేమ చిగురించింది

ఇటీవలే ఇద్దరూ దుబాయ్‌ నుంచి  తిరిగివస్తూ ఎయిర్‌పోర్టులో మీడియాకు చిక్కారు

 తకిటతకిట, పిల్ల జమిందార్‌, ఈ వర్షం సాక్షిగా, గలాటా తదితర తెలుగు సినిమాల్లో నటించింది హరిప్రియ

నారప్ప, నయీమ్‌ డైరీస్‌, ఓదెల రైల్వే స్టేషన్‌, కేజీఎఫ్‌ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వశిష్ట