ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరో తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ చిత్రం ‘సలార్‌’.

ఈ చిత్రం రెండు భాగాలుగావస్తుందని ఎప్పట్నుంచో వార్తలు వినిపిస్తున్న దీనిపై చిత్రబృందం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు.

అయితే ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్న  కన్నడ నటుడు దేవరాజ్‌ ఇప్పుడీ విషయాన్ని ధ్రువీకరించారు.

ఈ విషయమై  ఓ ఇంటర్వ్యూలో.. ‘నా పాత్రకు ‘సలార్‌’ మొదటి భాగంలో కంటే రెండవ భాగంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంద’ని తెలిపారు దేవరాజ్‌.

దీంతో ఈ మూవీ రెండు భాగాలేనని తేలిపోయినట్లయింది.

ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన శ్రుతిహాసన్‌ నటిస్తుంది.

జగపతిబాబు, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

కాగా ఈ చిత్రం సెప్టెంబర్‌ 28న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించనుంది.