బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ పై మరోసారి సీరియస్ అయ్యారు హీరోయిన్ కంగనా రనౌత్.
కరణ్ తన గురించి మాట్లాడుతోన్న ఓ పాత వీడియోను షేర్ చేస్తూ.. ‘‘పనికిమాలిన ప్రేలాపనలకు ధన్యవాదాలు.
నేను కూడా ఒక నిర్మాత, దర్శకురాలిగా ఎదిగిన తర్వాత ఇవే మాటలను మీ ముఖాన కొట్టినట్లు చెబుతా’’ అంటూ సవాల్ చేస్తూ పోస్ట్ పెట్టారు కంగనా.
గతంలో కరణ్ ఓ ఇంటర్వ్యూలో కంగనాను ఉద్దేశిస్తూ.. ‘‘ఆమె తరచూ మమ్మల్ని మూవీ మాఫియా అని అంటుంది.
ఇంతకీ ఆమె ఉద్దేశం ఏమిటి? మేము ఏం చేస్తున్నాం అనుకుంటోంది? ఆమెకు వర్క్ ఇవ్వడం లేదనుకుంటుందా?
అందుకే మమ్మల్ని మాఫియా అంటుందా? ఆమె వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదు. మా ఇష్ట ప్రకారం మేము పనిచేస్తాం.
ఆమెతో కలిసి చిత్రాల్లో పనిచేసే ఆసక్తి లేదు’’ అని కరణ్ మాట్లాడిన ఓ వీడియోను నెటిజన్ షేర్ చేయగా దానిపై కంగన సీరియస్ అయ్యారు.
ఇన్‌స్టా వేదికగా దర్శకురాలిగా మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కరణ్ సంగతి చెబుతానంటూ కరణ్‌కు సవాలు విసిరారు.