తన అందం అభినయంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు నటి కంగనా రనౌత్‌

తను దర్శకనిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’

1975నాటి ఎమర్జెన్సీ చీకటి రోజుల్లోని వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది

ఈ చిత్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనున్నారు కంగనా

ఈ సందర్భంగా ఓ పాత ఇంటర్వ్యూల్లో ఆమె చెప్పిన ఆసక్తికర విషయాలతో ఉన్న ఓ వీడియోని ఆదివారం షేర్ చేశారు కంగనా

ఈ వీడియోలో తనకి వంటపై ఉన్న అమితమైన ఇష్టంతో సొంతంగా ఒక రెస్టారెంట్‌ని ప్రారంభించాలనుకుందట

కానీ తన చివరి సినిమా ‘ధాకడ్‌’ తీవ్రంగా నిరాశ పరచడంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ ప్రయత్నం నెరవేరలేదట

అయితే  ఇంటిని, విలువైన వస్తువులన్నీ తాకట్టు పెట్టి మరీ ‘ఎమర్జెన్సీ’ చిత్రన్నీ నిర్మిస్తున్నానని తెలిపింది కంగనా

ఈ వివరాలు తెలిపుతూ ‘చేతిలో ఐదువందల రూపాయలతో ముంబయి నగరానికి వచ్చాను. ఒకవేళ ఈ చిత్రంతో మొత్తం కోల్పోతే నేను మళ్లీ మొదటి పరిస్థితికే వస్తాను

అయినా నేనేం ఆత్మవిశ్వాసం కోల్పోను. నా కాళ్లపై నేను నిలబడతాననే నమ్మకం ఉంది’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు కంగనా