తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ త్వరలో సామాజిక అంశంతో కూడిన చిత్రంతో అలరించనున్నారు.
ఈ చిత్రం కోసం ‘నేర్కొండ పార్వై’, ‘వలిమై’, ‘తునివు’ లాంటి చిత్రాల డైరెక్టర్ హెచ్ వినోద్‌తో కలిసి పనిచేయనున్నారు.
మంగళవారం సోషల్ మీడియా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.
‘కెహెచ్233’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది.
రైతుల మధ్య సాగె కధాంశంతో సామాజిక బాధ్యతతో కూడిన చిత్రంగా తెరకెక్కనుంది.
తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్‌నేషనల్ లో కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం.
ఈ చిత్రం గురించి తదుపరి వివరాలు త్వరలో తెలియజేయనున్నారు మూవీ మేకర్స్.
ప్రస్తుతం శంకర్ ‘భారతీయుడు-2’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు కమల్ హాసన్.
ఈ చిత్రం ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది.