ఇటీవలే విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు హీరో కమల్ హాసన్ (Kamal Haasan).
డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా కోలీవుడ్లో అత్యంత ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాదించింది.
ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం కమల్ హాసన్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు.
గత రెండేళ్లుగా షూటింగ్ నిలిచిపోయిన ఈ మూవీ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది.కమల్ హాసన్తోపాటు హీరోయిన్ కాజల్ సైతం ఈ మూవీ చిత్రీకరణలో పాల్గోంటున్నారు.
ఇప్పుడు ఇండియన్ 2కు కమల్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.
లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఏకంగా రూ. 150 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.
అయితే కమల్ రెమ్యునరేషన్ గురించి కేవలం వార్తలు మాత్రమే వినిపిస్తుండగా.. అధికారికంగా తెలియరాలేదు.