సౌత్‌లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొంది పలు బాలీవుడ్‌లో చిత్రాల్లోనూ నటించింది కాజల్‌

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌ కంటే సౌత్ చిత్రపరిశ్రమలోనే పనిచేయడానికి ఇష్టపడతానని తెలిపింది కాజల్

‘హిందీ నా మాతృభాష. హిందీ సినిమాలు చూస్తూ పెరిగాను. బాలీవుడ్‌లో మంచి సినిమాల్లోనే నటించా.

కానీ, నేను దక్షిణాది చిత్ర పరిశ్రమలోని నైతికత, విలువలు, క్రమశిక్షణను ఇష్టపడతాను.

అవి హిందీ చిత్రపరిశ్రమలో లోపించాయని అనుకుంటున్నాను’ అని ఆమె పేర్కొంది.

‘దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన భాష కాబట్టి హిందీలో తమ వృత్తిని ప్రారంభించాలనుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారు.

కానీ, దక్షిణాది చిత్రపరిశ్రమలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. అద్భుతమైన దర్శకులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలలో మంచి కంటెంట్‌ వస్తుంటుంది’ అని తెలిపింది కాజల్.