టాలీవుడ్ చందమామ కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని మనసారా ఆస్వాదిస్తోంది.

తన కుమారుడు నీల్‌ కిచ్లూ (Neil Kitchlu) తో అమ్మతనంలోని ఆనందాన్ని ఎంజాయ్‌ చేస్తోంది.

తల్లిగా ప్రమోషన్‌ పొందిన తర్వాత సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ తన పిల్లాడి ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేసుకుంటోంది.

అయితే తన ముద్దుల కుమారుడి ముఖం మాత్రం ఇప్పటివరకు రివీల్‌ చేయలేదు.

అమ్మతనం కారణంగా చాలా రోజులకు సిల్వర్‌ స్ర్కీన్‌కు దూరంగా ఉన్న చందమామ మళ్లీ హీరోయిన్‌గా బిజీ కానుంది.

తాజాగా తన భర్త కొడుకుతో ఉన్న ఓ ఫోటోను షోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ చందమామ..

ఈ ఫొటోస్ సామజిక మాధ్యమాలలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి..