అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లితర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే.

స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే గౌతమ్ ను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది కాజల్ అగర్వాల్

పెళ్లైన తర్వాత మెగాస్టార్ ఆచార్య  సినిమాతో పాటు.. కమల్ హాసన్ నటిస్తోన్న భారతీయుడు 2 సినిమాలకు కమిట్ అయ్యింది.

అయితే ఆ సమయంలో ఆమె ప్రగ్నెంట్ అవ్వడంతో మెగాస్టార్ సినిమానుంచి తప్పుకుంది.

అయితే ఇప్పుడు కాజల్ తిరిగి కెమెరా ముందుకు రానుందని తెలుస్తోంది.

కమల్ హాసన్ భారతీయుడు 2 షూటింగ్ లో కాజల్ అగర్వాల్ పాల్గొననుంది.

సెప్టెంబర్ 13 నుంచి  ఈ మూవీ  ప్రారంభం కానుంది.

నేహా ధూపియాతో ఇన్ స్టా గ్రామ్ లో లైవ్ చాట్ సందర్భంగా ఈ విషయాన్ని కాజల్ స్వయంగా వెల్లడించింది.