స్టార్ కథానాయికగా యువ హీరోలందరితోనూ ఆడిపాడిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు అగ్ర హీరోలతోనూ జోడీ కడుతున్నారు.
బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఎన్‌బీకే108 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ నటిస్తోంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం పోస్టర్‌ను పంచుకుంది. ఈ క్రమంలోనే కాజల్ ఈ మూవీ సెట్స్‌లోకి అడుగుపెట్టారు.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది.
వివాహం, బిడ్డ పుట్టిన తర్వాత కూడా కాజల్ తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.
తాజాగా ఆమె నటించిన తమిళ చిత్రం ‘ఘోస్టీ’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.