‘భగవంత్‌ కేసరి’ కాజల్ ఫస్ట్ లుక్ విడుదల..

బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భగవంత్‌ కేసరి’.

ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో శ్రీలీల ఓ కీలక పాత్రలో నటిస్తుంది.

బాలయ్యకి జోడిగా కాజల్ అగర్వాల్ కనిపించనుంది.

ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది.

కాగా సోమవారం కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం.

అందులో కళ్ల జోడుతో, బుక్ పట్టుకొని, ఫోన్ మాట్లాడుతూ కాజల్ ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

సైన్ స్టూడియోస్ పథకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.