హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధమైంది

ప్రసూతి విరామం తీసుకొని సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళి తెలుగు సినిమా సెట్లోకి అడుగుపెట్టింది కాజల్

ఇటీవలే ‘భారతీయుడు2’సెట్స్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే

తెలుగులో బాలకృష్ణకు జోడిగా నటించేందుకు సిద్ధం అయ్యింది

సోమవారం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రం సెట్లోకి  అడుగుపెట్టింది కాజల్‌

ఈ సందర్భంగా ఆమెకి ఘనంగా స్వాగతం పలికింది చిత్రబృందం

ఈ మూవీలో కాజల్‌తోపాటు, మరో కథానాయిక శ్రీలీల బాలకృష్ణకు కూతురిగా నటిస్తున్నారు

ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్‌ బ్యానర్ పై హరీష్‌ పెద్ది, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.