చాలా కాలం తర్వాత టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ రీఎంట్రీ ఇస్తుంది. తన కొడుకుతోపాటు షూటింగ్స్‏లో పాల్గొంటుంది.

మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంట.. తన కొడుకుకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది.

ఆమె కుమారుడు నీల్ పుట్టి 8 నెలలు పూర్తయిన సందర్బంగా కాజల్ తన ఇన్ స్టా ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్ట్ రాసింది.

తన కొడుకు అందమైన ఫోటో షేర్ చేస్తూ.. అతడికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది.

నువ్వు పుట్టి అప్పుడే 8 నెలలు పూర్తయ్యింది. కాలం ఎంతో తొందరంగా గడిచిపోయింది. ఒక యంగ్ మదర్ గా నీ విషయంలో నేను ముందు భయపడ్డాను.

ఒక తల్లిగా నా కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వర్తించగలనా లేదా అనుకున్నాను. ఇప్పటికీ గొప్ప తల్లిని ఎలా అవ్వాలో నెర్చుకుంటూనే ఉన్నాను.

నాకు ఎన్ని పనులు ఉన్నా.. నీ కోసం నా సమయాన్ని ఎప్పుడూ కేటాయిస్తూనే ఉంటాను.. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను.నీపై శ్రద్ద చూపడంలో నేను ఎక్కడా రాజీపడను.

ఇది నాకు సవాలుతో కూడుకున్నదే అయినా.. నేను పొందే ఆనందం ముందు ఆ సవాలు చిన్నదే అనిపిస్తుంది. నువ్వు రాత్రిపూట చేసే అల్లరి నాకు సంతోషాన్ని ఇస్తుంది.

నీ గురించి మీ నాన్న నేను సరదాగా మాట్లాడుకుంటాము.నీకు జన్మనిచ్చే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మై లవ్..మై నీల్.. ” అని రాసుకొచ్చింది కాజల్.