ఉత్తరాదికి చెందిన కాజల్‌ అగర్వాల్‌ దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో స్టార్‌ హీరోలందరితో జతకట్టారు.

2020లో పెళ్లి చేసుకున్న కాజాల్‌ అగర్వాల్‌ 2022 కల్లా గోడకు తగిలిన బంతిలా మళ్లీ నటన వైపు తిరిగొచ్చేశారు. 

వివాహం అయిన తర్వాత, నటీమణులు హీరోయిన్‌గా కొనసాగటం కష్టమే అంటారు. దాన్ని కాజల్‌ అగర్వాల్‌ బ్రేక్‌ చేశారు. 

పెళ్లే కాదు బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈమె కమలహాసన్‌కు జంటగా ఇండియన్‌ 2 చిత్రంలో నటిస్తున్నారు. 

తదుపరి తెలుగులో బాలకృష్ణ సరసన నటించే లక్కీ చాన్స్‌ కాజల్‌ను వరించింది.

కాగా కోలీవుడ్లో నటుడు అజిత్‌కు జంటగా నటించే అవకాశం కూడా ఈమె తలుపు తట్టిందనేది తాజా సమాచారం.

అజిత్‌ 62వ చిత్రంలో కాజల్‌ను హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.