ఉపేంద్ర, సుదీప్‌ , శివరాజ్‌ కుమార్‌ హీరోలుగా నటించిన మల్టీస్టారర్‌ చిత్రం ‘కబ్జ’

ఆర్‌.చంద్రు దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రియా సరన్ హీరోయిన్

ప్రముఖ హీరో దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌ జయంతిని సందర్భంగా ఈనెల 17న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు

ఈ చిత్రం కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయన్నారు

ఈ చిత్రం నిర్మాత ఎన్‌.సుధాకర్‌ రెడ్డి సమర్పణలో హీరో నితిన్‌ సొంత నిర్మాణ సంస్థలు రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎన్‌.సినిమాస్‌ బ్యానర్ పై తెలుగులో విడుదలవుతోంది

తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని అమితాబ్‌ బచ్చన్‌  విడుదల చేశారు

‘ఒక సామ్రాజ్యం నరికే కత్తితో కాదు.. ఆ కత్తిని పట్టిన బలమైన చేతితోనే సాధ్యం’ అంటూ సాగె ఈ ట్రైలర్‌ అదిరిపోయింది

1960 కాలం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఉపేంద్ర గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారు