దర్శకుడిగానే కాదు, నటుడిగానూ తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారు కె.విశ్వనాథ్

తండ్రిగా, ఊరి పెద్దతగా, తాతగా పలు పాత్రల్లో  తెలుగుతోపాటు, తమిళం, కన్నడ ప్రేక్షకులను మెపించారు

తను నటనవైపు రావడం గమ్మత్తుగా జరిగిందని కే.విశ్వనాథ్ ప్రతిసారి చెప్పేవారు

తెరపైకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిర్మాతగా ‘శుభసంకల్పం’ ప్రారంభించాం. అందులో రాయుడు పాత్ర చాలా కీలకం

కమల్‌హాసన్‌ ఎప్పుడూ చేతులు కట్టుకుని ఆయన ముందు నిలబడుతుంటాడు. ఆ పాత్రకి తగ్గట్టుగా గంభీరమైన వ్యక్తిని ఎంపిక చేయాలనుకున్నాం

శివాజీ గణేశన్‌ సహా పలువురు పేర్లు ప్రస్తావనకొచ్చాయి. రకరకాల కారణాలతో ఆ పాత్రకి నటుల ఎంపిక జరగలేదు. ఈలోగా చిత్రీకరణ మొదలైంది. రాయుడు పాత్ర తేలడం లేదు

ఎవరో తొందరగా తేల్చమని నిర్మాత బాలుని అడిగితే.. ‘కథ చెప్పేటప్పుడే ఆ పాత్రకి మీరైతే సరిపోతారని అనిపించింది. మీరు ఆ పాత్ర పోషిస్తేనే ఈ సినిమా చేద్దాం, లేదంటే మానేద్దాం’ అంటూ వెళ్లిపోయాడు

నాకో పట్టాన అర్థం కాలేదు. ఆ తర్వాత యూనిట్‌లో కొంతమంది నచ్చజెప్పి ఒప్పించారు. అలా తొలిసారి ముఖానికి రంగేసుకున్నా’’ అని అయన చెప్పువారు

‘కలిసుందాం రా’, ‘నరసింహనాయుడు’, ‘నువ్వు లేక నేను లేను’, ‘సంతోషం’, ‘స్వరాభిషేకం’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘పాండురంగడు’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ వంటి సినిమాల్లో అయన నటన ఎన్నడూ మరువలేనిది