శీతాకాలంలో మన శ్వాసకోశ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. దీని వల్ల శ్వాస సమస్యలు, ఆస్తమా, జలుబు వంటి సమస్యలు మొదలవుతాయి.

అటువంటి పరిస్థితిలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఊపిరితిత్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అవి బలహీనమవుతాయి.

సొరకాయ రసం: సొరకాయలో ఉండే పోషకాలు ఊపిరితిత్తులకు మేలు చేస్తాయి.

ఆకుకూరల రసం: ఆకుపచ్చని కూరగాయలు లంగ్స్ ను బలంగా మారుస్తాయి.

క్యారెట్ రసం: క్యారెట్ రసంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్‌లోని పోషకాలు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి.

బీట్రూట్ రసం: బీట్‌రూట్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలోని పోషకాలు ఊపిరితిత్తులను నిర్విషీకరణ చేస్తాయి.

టమాటో రసం: టొమాటో రసంలో ఉండే పోషకాలు శ్వాసకోశ సమస్యలను దూరం చేసి ఊపిరితిత్తులను బలంగా మారుస్తాయి