స్టూడెంట్ నెంబర్ 1 సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా ??

కొన్ని సినిమాలు ఒక హీరో చేతి నుండి జారిపోయి మరో హీరో చేతికి వెళ్లడం..అవి హిట్ లేదా ఫట్ అవ్వడం ఇలాంటివి మనం ఇదివరకు ఎన్నో చూశాము.

కొన్ని సినిమాలు ఒక హీరో చేతి నుండి జారిపోయి మరో హీరో చేతికి వెళ్లడం..

అవి హిట్ లేదా ఫట్ అవ్వడం ఇలాంటివి మనం ఇదివరకు ఎన్నో చూశాము.

ఆ కోవకి చెందిందే స్టూడెంట్ నెంబర్ 1.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో అందుకున్న మొట్టమొదటి సూపర్ హిట్ చిత్రం స్టూడెంట్ నెంబర్ 1.

అటు ఎస్ఎస్ రాజమౌళి కి కూడా ఈ సినిమా మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది.

ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి అశేషమైన స్పందన లభించింది.

అయితే ప్రముఖ నిర్మాత చలసాని అశ్విని దత్ ఇటీవల “అలీతో సరదాగా” షోలో పాల్గొని ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

2001లో ఈ చిత్రం అనుకున్నప్పుడు మొదట ప్రభాస్ తో చేయాలని అనుకున్నాం.

 ఈ సినిమాతోనే ప్రభాస్ ని టాలీవుడ్ కి పరిచయం చేద్దామనే దిశగా చర్చలు సాగుతున్న సమయంలో.. హరికృష్ణ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది.

దీంతో మా ఆలోచన మారింది. ఇక చివరికి ప్రభాస్ ని కాదని ఎన్టీఆర్ ని తీసుకున్నాము” అని ఆసక్తికర విషయాలని పంచుకున్నారు నిర్మాత అశ్విని దత్.