ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల మధ్య జరిగిన సరదా చిట్‌చాట్ ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.
ఇప్పటికే పుష్ప టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది.
తాజాగా ఏప్రిల్8న ఆయన పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్‌డే బన్నీ అనే హాష్ టాగ్ ట్రెండింగ్‌లో ఉంది.
ఇక అల్లు అర్జున్ 41వ బర్త్‌డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్‌డే విషెస్‌ను అందించగా, ఎన్టీఆర్ చేసిన ట్వీట్ మాత్రం వైరల్‌గా మారింది.
'హ్యాపీ బర్త్‌డే బావా.ఈ ఏడాది నీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా'.. అంటూ తారక్ అల్లు అర్జున్‌కు విషెస్ చెప్పగా..
ఆయన కూడా 'థాంక్యూ వెరీ మచ్ బావ.. హగ్స్' అంటూ బన్నీ రిప్లై ఇచ్చారు.
దీనికి మళ్లీ తారక్ స్పందిస్తూ.. 'ఓన్లీ హగ్స్ ఏనా? పార్టీ లేదా పుష్ప? అంటూ తనదైన స్టైల్‌లో అడగ్గా.. దీనికి బన్నీ వస్తున్నా అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు.
మొత్తంగా వీరిద్దరి మధ్య కొనసాగిన ట్విటర్ చాట్ నెట్టింట వైరల్ అవుతుంది.