ఇటీవలే ఎన్టీఆర్,రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ట్రిపుల్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినా సంగతి అందరికి తెలిసిందే.

ఈ చిత్రంలో ఎన్టీఆర్,రామ్ చరణ్ లు కొమరం భీం,అల్లూరి సీతారామరాజు పాత్రలలో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసారు

విడుదలైన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఈ చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

ఇప్పటికే ఈ చిత్రం రూ.1000 కోట్లు వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.ఈ క్రమంలో ట్రిపుల్ ఆర్ చిత్ర యూనిట్ సక్సెస్ పార్టీ ని జరుపుకున్నారు.

ఈ పార్టీలో ఎన్టీఆర్ తో పాటు పెద్ద కొడుకు అభయ్ రామ్ కూడా రావడం జరిగింది.

అయితే అభయ్ ను తన ఫేవరేట్ హీరో ఎవరు అని అడగగా ఏ మాత్రం ఆలోచించకుండా మహేష్ బాబు అని చెప్పేసాడు.

మహేష్ బాబు అంటే తనకు చాల ఇష్టమని,ఆయన నటించిన బిజినెస్ మ్యాన్ మూవీ తనకు చాల నచ్చుతుందని చెప్పుకొచ్చాడు అభయ్.

అభయ్ మాటలకూ ఇటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు అటు మహేష్ బాబు అభిమానులు కూడా చాల ఖుషీగా ఫీల్ అవుతున్నారు.