గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో డిజాస్టర్ అయిన చిత్రాలు ఇటీవల మళ్లీ విడుదలై భారీగా వసూళ్లు రాబడుతున్నాయి.

ఇక ఇప్పుడు మరో సూపర్ హిట్ మూవీ రీరిలీజ్ కు సిద్ధమయ్యింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబోలోనే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా సింహాద్రి.

ఈ మూవీని మరోసారి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఎన్టీఆర్ పుట్టిన రోజు (మే 20న) ఈ సినిమాను మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు.

అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇప్పటివరకు ఏ హీరో రీరిలీజ్ కు దక్కని రికార్డ్ తారక్ సొంతం కాబోతుంది.

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఉన్న ఐమ్యాక్స్ స్క్రీన్ పై ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఐమ్యాక్స్ థియేటర్.

ఇప్పటివరకు ఏ హీరో సినిమా రీరిలీజ్ ఈ మెల్ బోర్స్ లోని ఐమ్యాక్స్ థియేటర్లలో రాలేదు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

సింహాద్రి సినిమా రీరిలీజ్ ఐమ్యాక్స్ స్క్రీన్ పై ప్రదర్శించనున్న విషయాన్ని స్వయంగా ఐమ్యాక్స్ మెల్ బోర్న్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.