టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‏ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తారక్ కోసం ప్రాణాలిచ్చే అభిమానులు ఉన్నాయి. ఆయన సినిమా కోసం వేయి కళ్లతో వెయిట్ చేస్తుంటారు నందమూరి ఫ్యాన్స్.

తాజాగా తారక్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.అదేంటంటే.. ఎన్టీఆర్ 30 తర్వాత తారక్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ మూవీ రాబోతుంది.

ఈ సినిమా తర్వాత తారక్ మరోసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. ఓ రియాల్టీ షోతో ఆయన మళ్లీ తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారట.

అయితే ఈ రియాల్టీ షో గురించి ఇప్పటివరకు ఎలాంటి డీటైల్స్ బయటకు రాలేదు. కానీ ఈ షోకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

త్వరలోనే ఇందుకు సంబంధించిన అనౌన్స్ రానుందని… ఈషోతో అభిమానులకు మరింత చేరువ కానున్నాడు తారక్.

గతంలో తారక్.. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ హోస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే. ఆయన బుల్లితెరపై సందడి చేయడం అదే తొలిసారి. అయినా.. తనదైన హోస్టింగ్.. కామెడీతో ప్రేక్షకులను అలరించాడు.

నిజానికి బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం తారక్ అనే చెప్పుకొవాలి. అయితే ఎన్టీఆర్ మళ్లీ బుల్లితెరపై సందడి చేయనుండడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.