జోస్ బట్లర్ తుఫాన్ ఇన్నింగ్స్.. ఖాతాలో చేరిన 3 భారీ రికార్డులు..
బ్రిస్బేన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 20 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.
ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ అద్భుత ప్రదర్శనతో 47 బంతుల్లో 73 పరుగులు చేశాడు.
ఇంగ్లండ్ తరపున అత్యధిక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
దీంతో పాటు ఈ ఫార్మాట్‌లో జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
అంతర్జాతీయ టీ20లో బట్లర్ 100 మ్యాచ్‌ల్లో 92 ఇన్నింగ్స్‌ల్లో 2468 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు చేశాడు.
101 నాటౌట్‌తో అత్యధిక స్కోర్ నమోదు చేశాడు. బట్లర్ ఈ ఫార్మాట్‌లో 19 సార్లు నాటౌట్‌గా నిలిచాడు.
బట్లర్ ఇంగ్లండ్ తరపున అత్యధిక టీ20ఐలు (100) ఆడడంతో పాటు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రెండో స్థానానికి చేరుకున్నాడు.
ఇంగ్లండ్ తరపున అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు మోర్గాన్.
ఇంగ్లండ్ తరపున టీ20ఐల్లో అత్యధికంగా 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' (9) అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా మోయిన్ అలీ రికార్డు సృష్టించాడు.
కాగా, బట్లర్ ఈ అవార్డును 8 సార్లు గెలుచుకుని సంయుక్తంగా రెండో స్థానానికి చేరుకున్నాడు.
డేవిడ్ మలన్, మోర్గాన్ 8 సార్లు ఈ అవార్డును గెలుచుకున్నారు.