శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’
వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలో నటిస్తున్నారు
ఈ మూవీ ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్న విషయం తెలిసిందే
ఇప్పటికే ఓ హీరోయిన్ గా రుహానీ శర్మను ఎంపిక చేశారు మూవీ మేకర్స్
తాజాగా మరో హీరోయిన్ గా ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్‌ను ఖరారు చేసినట్లు తెలిస్తోంది. చిత్రానికి ఆమె పాత్రే కీలకంగా ఉండనున్నట్లు సమాచారం
కాగా మూడో కథానాయకిగా ఓ బాలీవుడ్ భామను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం
వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది
ఇందులో భాగంగా వెంకటేష్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు