జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు దర్శకుడు అనుదీప్.
దీనికి తోడు తన ప్రవర్తన, పంచ్ డైలాగ్స్ ఇలా అన్ని ఆయనకు బోలెడంత పాపులారిటీ తెచ్చాయి.
ఇక జాతిరత్నాలు తర్వాత అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ప్రిన్స్. ఈ సినిమా తమిళ్‌లో తీసి తెలుగులో డబ్ చేశారు.
ఇక అది అలా ఉంటే తాజాగా దర్శకుడు అనుదీప్ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. తనకు అరుదైన వ్యాధి ఉన్నట్లు తెలిపారు.
ఆయన తన వ్యాధి గురించి మాట్లాడుతూ.. తనకు హైలీ సెన్సిటీవ్ పర్సన్ డిజార్డర్ ఉందని అని అన్నారు.
'నా శరీరంలో చోటు చేసుకున్న కొన్ని మార్పుల వల్ల ఈ వ్యాధిని గుర్తించానని.. తనకు గ్లూటెన్ పడదని.. కాఫీ తాగితే 2 రోజుల వరకు నిద్రరాదని అన్నారు.
అంతేకాదు పళ్లరసం తాగితే మెదడు పనితీరు ఆగిపోతుందని కూడా చెప్పారు. కొన్ని సార్లు మైండ్ కూడా అంతా బ్లాక్ అవుతుందిని.. త్వరగా అలసిపోతానని అన్నారు.
చాలా బ్రైట్‌గా ఉంటే లైట్లను చూడాలనేనని.. ఘాటైన వాసనలు చూసినా తట్టుకోలేనని చెప్పారు.