అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఎన్టీఆర్30 సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్న విషయం తెలిసిందే
కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది
ఇటీవలే జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్రబృందం
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మూవీలో నటించడానికి జాన్వీ భారీ మొత్తంలో పారితోషికం తీసుకోనుందట
కాగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం జాన్వీ రూ. 5 కోట్లు చార్జ్ చేస్తున్నట్లు సమాచారం
వాస్తవానికి బాలీవుడ్ చిత్రాల్లో జాన్వీ రూ. 3 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేది
కానీ తెలుగులో ఎంట్రీకి మాత్రం ఒకేసారి కోటిన్నర పెంచడంతో టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది
కాగా దీపికా పదుకొణె 'ప్రాజెక్టు K' మూవీ కోసం ఏకంగా రూ.10 కోట్లు తీసుకోనుండడంతో తర్వాత అత్యధిక మొత్తం చార్జ్ చేస్తున్న హీరోయిన్‌గా నిలిచింది జాన్వీ కపూర్