అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఖరారైన విషయం తెలిసిందే.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 30వ సినిమాతో జాన్వీ తెలుగు తెరకు పరిచయం కానుంది.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఇదివరకే విడుదల చేశాయి.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ సినిమాలో నటించేందుకు జాన్వీ భారీ మొత్తంలో పారితోషికం పుచ్చుకుందట.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం జాన్వీ రూ. 5 కోట్లు చార్జ్‌ చేస్తుందట.

వాస్తవానికి బాలీవుడ్‌ సినిమాల్లో నటించడానికి జాన్వీ రూ. 3 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు పారితోషికంగా తీసుకునేది.