అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. అందం, అభినయంలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది
అందుకే ఓ వైపు గ్లామర్ పాత్రలు పోషిస్తూనే మరోవైపు కార్గిల్ గర్ల్, మిలీ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది.
సినిమాలే కాదు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ యాక్టివ్‌గా ఉంటుంది. నెట్టింట ఆమెకు బోలెడు ఫాలోవర్లు ఉన్నారు. ముఖ్యంగా ఈ సొగసరి గ్లామరస్,ఫ్యాషనబుల్ ఫొటోలకు కామెంట్ల వర్షం కురుస్తుంది.
అయితే టాలీవుడ్ మెగా పవర్ స్టార్ హీరో రామ్‌చరణ్.. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన డైరెక్షన్‌లో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ నటించనుందని టాక్
జాన్వీ చాలా కాలంగా టాలీవుడ్ లో సినిమా చేయాలని చూస్తోంది. మొన్నామధ్య తారక్ తో సినిమా చేస్తుందని వార్తలు వచ్చాయి.