అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా సినీ పరిశ్రమకు నటి జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చింది
హిందీ చిత్రం దడక్ ద్వారా కథానాయికగా రంగప్రవేశం చేసింది
ఆమె సినీ పరిశ్రమలో ఆడుకుపెట్టి నాలుగేళ్లు అయ్యింది
ఇప్పటివరకు ఆరు చిత్రాల్లోనే నటించిన జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనా, మిల్లి వంటి చిత్రాల్లో నటనకు ప్రశంసలు అందుకుంది
అయితే ఆ సినిమాలు మాత్రం ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి
జాన్వీకపూర్ నటనలో కంటే గ్లామర్‌తోనే ఎక్కువ పాపులర్ అయ్యింది
కాగా ఆమెను దక్షిణాదిలో పరిచయం చేయాలని చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నం చేసిన ఇప్పటివరకు ఏ చిత్రానికి పచ్చజెండా ఊపలేదు
అయితే ఇటీవల చెన్నైలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నైకి వచ్చిన జాన్వికపూర్ దక్షిణాది చిత్రాల్లో నటించడం పక్కా అని, త్వరలోనే అది జరుగుతుందని చెప్పింది