ఇప్పటివరకు రెంట్ తో పలు ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో సందడి చేస్తున్న చిత్రం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’.
అయితే త్వరలో ఈ చిత్రం రెంట్ చెల్లించకుండానే అందుబాటులోకి రానుంది.
ఈ చిత్రం ‘డిస్నీ+హాట్స్టార్’ వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది.
ఈ అద్భుత చిత్రం జూన్ 7 నుంచి డిస్నీ+హాట్స్టార్లో అలరించనుంది.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారంగా ప్రకటించింది చిత్రబృందం.
ఈ ప్రకటనతో సినీ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని రోజులు వేచి ఉండాలా అని కొందరు, ‘వావ్’, ‘సర్ప్రైజ్ అదిరింది’ అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
కాగా ఏయే భాషల్లో స్ట్రీమింగ్ కానుందో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.