హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన మరో బిగ్గెస్ట్ విజువల్ వండర్ ‘ అవతార్- ది వే ఆఫ్ వాటర్ అవతార్ 2.
గతేడాది డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రంబాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.
ఏకంగా 160 భాషలలో విడుదలైన ఈ సినిమా పుల్ రన్‌ల రెండు బిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో రూ. 16423 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
థియేటర్లలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన అవతార్ 2 ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని అందరూ ఎదురుచూడసాగారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ ధరకు కొనుగోలు చేసింది.
మార్చి 28 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ‘అవతార్‘ టీం ఓ ట్వీట్ చేసింది.