జబర్దస్త్ కామెడీ షో గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ షో గత కొన్నేళ్లు తెలుగువారిని అలరిస్తోంది.
మొదట యాంకర్‌గా అనసూయ వచ్చింది. ఆ తర్వాత రష్మి కొన్నేళ్లు చేసింది.
ఇక యాంకర్ అనసూయ ఏవో కారణాలతో జబర్దస్త్‌ను వదిలిపోయింది. రష్మి కూడా వెళ్లిపోయిందని తెలుస్తోంది.
ఈ క్రమంలో జబర్దస్త్‌కు కొత్త యాంకర్ వచ్చింది. దీనికి సంబంధించి ఓ ప్రోమో కూడా విడుదలైంది. ఆ ప్రోమోలో కొత్త యాంకర్ సౌమ్య రావు దర్శనమిచ్చింది.
ఈ భామ గతంలో సీరియల్స్‌లో నటించేది. నటి నుంచి యాంకర్‌గా మారింది. దీంతో అసలు ఎవరు ఈ కొత్త యాంకర్ అంటూ నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.
సౌమ్య రావు ఓ కన్నడ అమ్మాయి. ఈ భామ ఈటీవీలో వచ్చే `శ్రీమంతుడు` సీరియల్ తో పాపులర్ అయ్యింది.. ఇక తాజాగా కామెడీ షో జబర్దస్త్‌లో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఈ కొత్త యాంకర్ రెమ్యూనరేషన్ ఎంత అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుస్తోన్న సమాచారం ప్రకారం సౌమ్య రావుకు రెమ్యూనరేషన్ ఎపిసోడ్ కి 60 వేలు ఇస్తున్నారట..