తెలుగు రాష్ట్రాల్లో యాంకర్‌ రష్మి పరిచయం అవసరం లేని పేరు 

యాంకరింగ్ తో పాటు హీరోయిన్ గా కూడా అలరిస్తోంది

ఎప్పుడూ సోషల్‌మీడియాలో చురుగ్గా ఫాన్స్ తో ముచ్చటిస్తుంది

మూగజీవులకు హాని చేయద్దని కోరుతూ ఆమె ట్వీట్స్‌ చేస్తూ ఉంటుంది

తాజాగా ఇలాంటి ఓ విషయంలో నెటిజన్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది రష్మీ

సంక్రాంతి కోడిపందెంలో ఓ డాక్టర్‌ తాను రెండు పందేల్లో గెలిచానని, సంక్రాంతిని బాగా ఎంజాయ్‌ చేశానని ట్వీట్ చేసాడు

ఆ స్క్రీన్‌షాట్‌ షేర్‌ చేస్తూ ‘డాక్టర్‌ డిగ్రీని మురికి కాలువలో పడేసి.. ఇలా హింసను ప్రోత్సహిస్తున్నారా’ అని రష్మీ ట్వీట్‌ చేసింది 

ఈ అంశంపై ట్విటర్‌ వేదికగా  జరిగిన చర్చలో  ఓ నెటిజన్‌ ‘కోడికి లేని బాధ మీకెందుకు మేడం  ఇది గర్వం కాదు.. మా సంప్రదాయం’ అని కామెంట్‌ చేసాడు

‘‘కోడికి బాధ లేదని మీకు ఎలా తెలుసు? అయినా మీరు మనుషుల పోరాటాలు ఎందుకు పెట్టడం లేదు.. గ్లాడియేటర్‌ పోరాటాలు సంప్రదాయాల్లో భాగమే. వాటిని స్వీకరించి చనిపోయే వరకు పోరడడానికి మనుషులను పంపాలి’’ అని స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది రష్మీ