బుల్లితెరపై గ్లామర్ బ్యూటీ యాంకర్ రష్మీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు.
టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. టీవీ యాంకర్ గానే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
తన అందంతో.. గ్లామర్ షోతో.. స్టేజ్ పై రచ్చ చేసే రష్మీ.. జంతువుల విషయంలో చాలా సీరియస్ గా ఉంటుంది. జంతువుల హింసను ఆపేందుకు ఎంతవరకైనా వెళ్తుంది.
తాజాగా డైరీ ప్రోడక్ట్స్ పై వివాదాస్పద ట్వీట్ చేసి వార్తల్లోకెక్కింది. తాను పాల ఉత్పత్తులను ప్రమోట్ చేయడం మానేశానని ఆ ట్వీట్ లో తెలిపింది.
2019లో రష్మీ ఓపెన్ చేసిన ఐస్ క్రీం షాప్ వీడియో స్క్రీన్ షాట్ ని షేర్ చేశారు.
‘ఈ సెలబ్రిటీలందరూ ఇంతే.. డబ్బుల కోసం ఏమైనా చేస్తారు. తర్వాత ఇలా పోస్టులు పెడతారు’ అని కామెంట్స్ చేశారు.
ఈ క్రమంలో నెటిజన్స్ కామెంట్స్ పై స్పందించిన రష్మీ.. “అవును.. గతంలో తెలియక కొన్ని తప్పులు చేశాను. కానీ.. నేను కొన్నాళ్ల నుండి పాలు తాగడం మానేశాను.
పాలు తాగడం వలన నా చర్మంపై అనారోగ్య ప్రభావం పడటం నేను గమనించాను.
అయితే.. ఫ్యాక్టరీలలో పాల ఉత్పత్తుల తయారీ విధానం గురించి తెలుసుకున్న తర్వాత పూర్తిగా వాటిని ప్రమోట్ చేయడం ఆపేశాను’’ అని చెప్పుకొచ్చింది.