మయోసైటిస్ ఆటో ఇమ్యూనీ వ్యాధితో బాధపడుతున్న సమంతా. టాలీవుడ్ హీరోయిన్ సమంత తన హెల్త్ అప్డేట్ అభిమానులతో పంచుకుంది.
ఆ వ్యాధికి సంబంధించిన నెలవారీ ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబలిన్ థెరపీ సెషన్‌కు హాజరైనట్లు చెప్పారు.
తాజా హెల్త్ అప్డేట్ ను తన ఇన్‌స్టా స్టేటస్‌లో షేర్ చేశారు. ‘న్యూ నార్మల్’ అంటూ హెల్త్ అప్డేట్ అభిమానులతో పంచుకున్నారు.
ఇక మయోసైటిస్‌కు సంబంధించి మానవ శరీరంలో బలహీనపడిన ఇమ్యూనిటీ సిస్టమ్‌ను సమర్థంగా పనిచేయించడంతో పాటు..,
ఇతర వ్యాధుల కారణంగా ఇన్‌ఫెక్షన్ బారినపడకుండా ఈ థెరపీ సహాయపడుతుంది. దీనికి సంబంధించిన చికిత్సను సమంత ఇంట్లోనే తీసుకుంటున్నారు.
చికిత్స తీసుకుంటున్నా వ్యాయామాన్ని మాత్రం సామ్ నిర్లక్ష్యం చేయడకుండా.. ఇంట్లోనే జిమ్ చేస్తున్నారు.
దీనికి సంబంధించిన వీడియోను కూడా సమంత ఎప్పటికప్పుడు ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు.
దీంతో సమంత మయోసైటిస్ ఆటో ఇమ్యూనీ వ్యాధి నుంచి కోలుకుంటున్నట్లే కనిపిస్తుంది.ఒకవైపు ట్రీట్మెంట్ తీసుకుంటూనే మరోవైపు సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తున్నారు సమంత.