తన స్టైల్‌తో ట్రెండ్ సెట్ చేసిన స్టార్ హీరో రజనీకాంత్
నటనలోనే కాదు వ్యక్తిత్వంలోనూ ఆయన ఎంతోమందికి స్ఫూర్తి
అయితే.. రజనీ మాత్రం తన భార్య తనను ఎంతో మార్చిందని.. ఆమెకు ఎప్పటికీ రుణపడి ఎప్పుడు అంటుంటారు
ఇప్పటికే రజనీ చాలా సందర్భాల్లో తన భార్య లత గురించి ఎన్నో వేదికలపై చెప్పారు
తమిళనాడులో ఇటీవల జరిగిన ఓ ప్రోగ్రాంలో అతిథిగా పాల్గొన్నారు రజనీ
నా భార్య లతను నాకు పరిచయం చేసిన మహేంద్రన్‌కు నేను రుణపడి ఉంటాను. బస్సు కండక్టర్‌గా చేస్తున్నప్పుడు రోజూ మద్యం తాగేవాడిని. రోజుకు ఎన్ని సిగరెట్లు తాగేవాడినో లెక్క ఉండేది కాదు. అలాగే రోజూ మాంసాహారం తీసుకునేవాడిని. కానీ, ఈ మూడు మంచి అలవాట్లు కాదు
వీటికి బానిసలైన వాళ్లు కొంతకాలం తర్వాత ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపలేరన్నది నా అభిప్రాయం. నా భార్య లత తన ప్రేమతో నన్ను ఎంతో మార్చింది. ఆమె వల్లే ఇప్పుడు నేను క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతున్నాను’’ అని రజనీ పేర్కొన్నారు