మన డైలీ రొటీన్‌లో తాగడం దగ్గర నుంచి తినడం వరకు అన్నీ కూడా ప్లాస్టిక్ వాటిల్లోనే తీసుకుంటుంటాం
ఆఫీసుల్లో, ఇంట్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిల్సే. తాగే నీరు ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ గ్లాసుల్లో తాగుతుంటాం
ఆహారం కూడా ప్లాస్టిక్ ప్లేట్లలో తింటుంటాం. ఇలా మన జీవితంలో ప్లాస్టిక్ ఒక భాగం అయిపోయింది
ఇలా ప్లాస్టిక్ వాటిల్లో తినడం, తాగడం వల్ల మన ప్రాణానికి ఎంతో ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు
ఇందువల్ల సంతానోత్పత్తి, మెదడు పనితీరు దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు
కొన్నిసార్లు బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు
ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువగా తినేవారు ఒబేసిటీ, గుండెకు సంబంధిత రోగాలు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడతారని నిపుణులు చెబుతున్నారు
అందుకే ప్లాస్టిక్, ప్యాకేజ్డ్ ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది