ఇల్లు కట్టేటప్పుడు వాస్తు అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి

ఇల్లు నిర్మాణం తరువాత ఇంట్లో ఏర్పాటు చేసే ఫ్రిజ్, సోఫా, బెడ్ మొదలైన వాటిని ఎక్కడ పెట్టాలో వాస్తు శాస్త్రం చెబుతోంది

మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం

తేలికపాటి ఫర్నిచర్‌ను ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచాలి. భారీ సైజ్‌, పెద్ద పెద్ద ఫర్నిచర్‌ను దక్షిణ లేదా పశ్చిమ దిశలో ఉంచాలి

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఫ్రిజ్ ఉంచడానికి అత్యంత అనుకూలమైన దిశ వాయువ్య దిశ

వాస్తు శాస్త్రం ప్రకారం రూమ్ అందాన్ని పెంచడానికి టీవీ, టెలిఫోన్లను ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేయాలి

వాస్తు ప్రకారం అద్దం ఎల్లప్పుడూ ఇంట్లో ఉత్తరం గానీ తూర్పు దిశలో గానీ ఉంచాలి

ఔషధాలు లేదా ప్రథమ చికిత్స కిట్ ఎల్లప్పుడూ ఇంట్లో ఈశాన్య దిశలో ఉంచాలి