శివుడిని మీరు ఏ రోజైనా పూజించవచ్చు. కానీ కార్తీక మాసంలో వచ్చే సోమవారం చాలా ప్రత్యేకమైనది
మహాదేవుడిని అభిషేకం ద్వారా సంతృప్తి పరిస్తే సకల సంపదలను ఇస్తాడని భక్తల విశ్వాసం
కార్తీక మాసంలోని సోమవారం ఈ వస్తువులతో పూజిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం
ఆవు పాలను నైవేద్యంగా పెడితే సర్వ దుఃఖాలు తొలగిపోతాయి
మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే దాని నుంచి బయటపడటానికి మీరు శివుడికి తప్పనిసరిగా ఆవు పాలు సమర్పించాలి
శివునికి గంగాజలం సమర్పించడం వల్ల జీవితానికి సంబంధించిన అన్ని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం
శని సంబంధిత దోషంతో బాధపడుతున్నా, కాలసర్ప దోషం ఉన్నా బయటపడటానికి మీరు ప్రత్యేకంగా శివ ధ్యానం చేయాలి
మహామృత్యుంజయ మంత్రాన్ని రుద్రాక్ష జపమాలతో జపించాలి. మీకు ఎటువంటి ఆపదలు ఉన్నా తొలగిపోతాయి