తన కుమారుడు చైతన్యకృష్ణను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేస్తూ నందమూరి జయకృష్ణ నిర్మిస్తున్న తొలి చిత్రం ‘బ్రీత్‌’

ఈ చిత్రాన్ని తాజాగా ప్రారంభించిన బసవతారకరామ క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.1గా తెరకెక్కుస్తున్నారు

వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వైదిక సెంజలియా హీరోయిన్

ఆదివారం ఈ మూవీ టైటిల్‌ పోస్టర్‌ను హీరో కల్యాణ్‌రామ్‌  విడుదల చేశారు

అనంతరం ‘‘ఈ సినిమాతో మా పెదనాన్న జయకృష్ణ నిర్మాతగా.. అన్నయ్య చైతన్య హీరోగా పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉంది

టైటిల్‌ పోస్టర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇదొక ఎమోషనల్‌ థ్రిల్లర్‌. ప్రేక్షకులందరినీ అలరిస్తుందని నమ్ముతున్నా’’ అని కల్యాణ్‌రామ్‌ తెలిపారు

‘‘చిత్రీకరణ పూర్తయింది. సినిమా అద్భుతంగా వచ్చింది’’ అని తెలిపారు నిర్మాత జయకృష్ణ