ఆరేళ్ళ క్రితం సరిగ్గా ఇదేరోజున ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటింది.

‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’. అనే ప్రశ్నకు సమాధానం దొరికింది సరిగ్గా ఈరోజునే.

మరి అదేంటో మీకు ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది.

అదే తెలుగు చలనచిత్రాన్ని ఖ్యాతిని ప్రపంచ నలుమూలల  ‘బాహుబలి 2’.

ఆరేళ్ళ క్రితం సరిగ్గా రోజునే అంటే ఏప్రిల్‌ 28 ‘బాహుబలి 2’ విడులైంది.

దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం సాధించిన రికార్డులు ఎన్నడూ మరువలేనివి.

ప్రభాస్‌, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాహుబలి 1కి సీక్వెల్‌గా వచ్చిన సంగతి తెలిసిందే.

2017లో దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం సుమారు రూ. 1810 కోట్లు పైనే వసూళ్లు చేసి నయా రికార్డు సృష్టించింది.

ఈ చిత్రం విడుదలై ఆరేళ్ళ పూర్తవుంతున్న ఈ రికార్డుని ఎవ్వరు అందుకోలేకపోయారు.